Beauty Tips

Tips for Pink Lips: నల్లని పెదాలు గులాబీ రంగులో ఉండాలంటే ఇలా చేయండి..

Tips for Pink Lips: నల్లని పెదాలు గులాబీ రంగులో ఉండాలంటే ఇలా చేయండి.. చాలా మంది పెదాలు నల్లగా, డ్రైగా మారడానికి అశ్రద్ద కూడా ఒక కారణం. పెదాలకు పోషణ సరిగా అందించక పోవడం వల్ల అంద విహీనంగా మారతాయి. మరి మీ పెదాలు అందంగా, పింక్ కలర్‌లోకి మారాలంటే ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి.

Tips for pink lips : చాలా మందికి పెదాలు నల్లగా మారి పొట్టు రాలుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో జీవం కోల్పోయి పెదాలు పగిలి నల్లగా మారి ఒక్కోసారి పెదాల నుండి నొప్పి, రక్తం కూడా వస్తూ ఉంటాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎక్కువగా నీటిని తాగాలి. అలాగే ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే కావలసిన తేమ అంది పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.
Dry lips beauty tips
ఫిగ్మెంటేషన్ తొలగిపోయి గులాబీ రంగులోకి మారతాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ పంచదార, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మూడింటిని బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెడితే మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ లేకపోతే బాదం నూనె లేదా కొబ్బరి నూనె వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే నల్లని పెదాలు క్రమంగా గులాబీ రంగులోకి మారతాయి. పెదాల మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే పెదాలు తేమగా ఉంటాయి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. కాకపోతే కాస్త ఓపిక,సమయం ఉండాలి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నల్లని పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."