Lungs cleansing: ఊపిరితిత్తులు ఇలా శుభ్రం చేస్తే.. ఏ సమస్యలు రావు..!
Lungs cleansing: ఊపిరితిత్తులు ఇలా శుభ్రం చేస్తే.. ఏ సమస్యలు రావు.. ప్రస్తుత జీవనశైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, స్మోకింగ్ , వివిధ రకాల వైరస్‌లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం ముఖ్యం. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తే (lungs cleansing).. వాటి సామర్థ్యం పెరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందిని దగ్గు,జలుబు వంటి సమస్యలు వేదిస్తున్నాయి. ఈ చలికాలంలో శ్వాస కోశ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమస్య ఉన్నవారిలో ఛాతిలో కఫం ఎక్కువగా ఉంటుంది. కనుక దాన్ని తొలగించి ఊపిరితిత్తులను శుభ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి.
దీని కోసం ఒక డ్రింక్ తయారుచేసుకోవాలి. పది నుంచి పదిహేను పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఈ పుదీనా ఆకులలో అంగుళం అల్లం ముక్క వేసి మెత్తగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి పుదీనా,అల్లం పేస్ట్ వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి.
రెండు నిమిషాలు అయ్యాక ఈ నీటిని గ్లాసులోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే ఊపిరితిత్తులలో కఫం, నిమ్ము వంటి సమస్యలు తగ్గటమే కాకుండా దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
పుదీనా, అల్లం, పసుపులో ఉన్న గుణాలు ఈ చలికాలంలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదకశక్తిని పెంచుతుంది. అలాగే ఈ డ్రింక్ ని అన్నీ వయస్సులవారు తాగవచ్చు. చిన్న పిల్లలు అయితే అరగ్లాసు, పెద్దవారైతే ఒక గ్లాస్ తాగవచ్చు. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ