MoviesTollywood news in telugu

Chiranjeevi – Surekha Marriage:చిరు సురేఖ గారి పెళ్లి విషయంలో ఏమి జరిగిందో తెలుసా?

Chiranjeevi – Surekha Marraige : మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికి సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి,సురేఖ గారి పెళ్లి సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ మధ్య అల్లు అరవింద్ గుర్తుకు చేసుకున్నారు. ఇంతకీ మెగాస్టార్ పెళ్లి సమయంలో ఏమి జరిగింది. ఆ విషయంలోకి వస్తే… అల్లు అరవింద్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా చిరంజీవిని ‘ప్రాణం ఖరీదు’ సినిమా ప్రివ్యూలో చూసాను.

అప్పటికే ఆయనను సినిమాల్లో చూసి ఉన్నాను కాబట్టి ఈ యువకుడు ఎవరో కానీ బాగా చేసాడే అని అనుకున్నాడు అరవింద్. అదే తోలి ఇంప్రెషన్. సోదరి సురేఖకు చిరంజీవి ఎలా ఉంటాడని అల్లు రామలింగయ్య ఇంటిలో ప్రశ్నించినప్పుడు, ఇంటిలో డిస్కషన్ పెట్టినప్పుడు మనమే సినిమా పరిశ్రమలో ఉంటూ సినిమా పరిశ్రమలో ఉన్నవారికి చెల్లెలిని ఇవ్వవచ్చా అని చర్చ అనవసరం.

అబ్బాయి మంచివాడని ఎవరైనా చెప్పితే చాలని అన్నారు. సురేఖ చిరంజీవిని.. మ‌న‌వూరి పాండవులు ప్రివ్యూ వేసిన‌ప్పుడు, త‌యార‌మ్మ బంగార‌య్య శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల్లో చూసి ఉండ‌టంతో ఆమె కూడా ఓకే చెప్పేసారు. దాంతో చిరు,సురేఖ గారి వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. 1980, ఫిబ్ర‌వ‌రి 20న మ‌ద్రాసులో పెళ్లి జ‌రిగింది.

ఆ విధంగా ఆ నాటి సంగతులను అల్లు అరవింద్ గుర్తుకు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులకు రామ్ చరణ్,శ్రీజ‌, సుష్మిత ముగ్గురు పిల్లలు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలో హీరోగా,నిర్మాతగా కొనసాగుతున్నాడు. సుస్మిత కూడా సినీ రంగంలోనే ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."