MoviesTollywood news in telugu

Kalpana Rai:అభిమానులను కడుపుబ్బా నవ్వించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..?

Lady comidian kalpana rai: టాలీవుడ్ లో ఎంత మంది లేడి కమెడియన్స్ ఉన్నా కల్పనా రాయ్ ది ఒక బిన్నమైన శైలి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కల్పనా రాయ్ చివరి రోజుల్లో కష్టాలు పడింది. కల్పనా రాయ్ అసలు పేరు సత్యవతి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యనారాయణ పురంలో 1940లో జన్మించిన కల్పనారాయ్ కి పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులు మరణించారు.

కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆమెకు ఆమె అక్క తోడుగా నిలిచింది. రంగ స్థలం మీద ఉన్న అనుభవంతో 1972లో ఓ సీత కథ మూవీతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. దాదాపు 500 లకు పైగా చిత్రాల్లో తన నటనతో ముఖ్యంగా హాస్యంతో అందరినీ గిలిగింతలు పెట్టింది. ఆమె తెరమీద కనిపిస్తే చాలు నవ్వులు పూసేవి. ఆమె మేనజరిజం తో హాస్యం ఫై ప్రత్యేక ముద్ర వేసింది.

అయితే సినిమా పాత్రల మాదిరిగానే ఆమె నిజ జీవితంలో కూడా కల్లా కపటం,కల్మషం తెలీని మనిషి. అందుకే సినిమాలలో బిజీ గా ఉంటూ సంపాదించిన సొమ్మును తన దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్లకు లేదనకుండా సహాయం చేసింది.

గుప్తంగా దానధర్మాలు చేసిన కల్పనారాయ్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గడం,చేతిలో చిల్లి గవ్వ లేక, ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇక ఆమె వయస్సు అనుభవం తెచ్చిందో లేదో గానీ అనారోగ్యం మాత్రం తెచ్చిపెట్టింది. ఆవిధంగా మూత్ర పిండాలు, గుండె వ్యాధుల బారినపడి, ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడింది.

ఆలా చివరి దశలో కష్టాల కడగండ్లు మిగుల్చుకుని, ఆదుకునేవాళ్ళు లేక చివరకు కన్నుమూసింది. ఆమె చివరి రోజుల్లో ఎవరూ తనను చూడ్డానికి కూడా రాకుండా ముఖం చాటేసినా సరే, బాధను గుండెల్లోనే దిగమింగుకుని,కన్నీళ్లు కనిపించకుండా, దొడ్డమనసు చాటుకుంటూ,శాశ్వతంగా ఈలోకం విడిచి వెళ్ళింది.

ఇక అంతిమ సంస్కారానికి కూడా డబ్బుల్లేక తోటి కళాకారులు చందాలేసుకుని తతంగం నడిపించారు. అందుకే ఆమె జీవితం చూస్తే, ఎలా పోయామన్నదే ముఖ్యం అనిపిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."