Kitchenvantalu

Masala Egg Omlette: పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే మసాలా కోడిగుడ్డు అట్టు రెసిపీ.. మీకోసం

Masala Egg Omlette: పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే మసాలా కోడిగుడ్డు అట్టు రెసిపీ.. మీకోసం.. Egg లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కావలసిన పదార్ధాలు
కోడిగుడ్డు 4
పెద్ద ఉల్లిపాయలు 2 ( చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
పచ్చి మిరపకాయలు 3 ( చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
కారం 1 టీస్పూన్
గరం మసాలా పొడి 1/2 టీస్పూన్
జీలకర్ర 2 టీస్పూన్
ఉప్పు తగినంత
టమాట 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
కొత్తిమీర ఆకులు 2 టేబుల్ స్పూన్
నూనె 4 టేబుల్ స్పూన్

తయారి విధానం
ఒక గిన్నెలో కోడిగుడ్లు పగలకొట్టి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా గిలకొట్టాలి.దానిలో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని వేడిచేసి, ఆవాలు వేసి పోపు పెట్టి, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర వేసి బాగా వేయించాలి.

అన్ని ముక్కలు బాగా వేగిన తరువాత, మంటమీద నుంచి దింపి కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.దోశల పెనంలో కొద్దిగా నూనె వేసుకొని వేడిచేసి, గరిటె సహాయంతో గుడ్డు మిశ్రమాన్ని వేయాలి.కొంచం ఎర్రగా కాలిన తరువాత, అట్టుని రెండవ వైపుకి తిప్పుకొని ఒకటి రెండు నిముషాలు అలాగే ఉంచాలి.అట్టు బాగా కాలిన తరువాత, వేడివేడిగా వడ్డించండి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."