Healthhealth tips in telugu

immunity food:దగ్గు,జ్వరం తగ్గటంతో పాటు మీ శరీరంలో ఇమ్యూనిటీని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కా

immunity food in telugu :దగ్గు,జ్వరం తగ్గటంతో పాటు మీ శరీరంలో ఇమ్యూనిటీని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కా..ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే… చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు,జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి.

అందుకే వాటిని వెంటనే తగ్గించుకొనే మార్గాలు గురించి ఆలోచించాలి. దగ్గు,జలుబు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఇవి లేకపోతె చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిల్ అవుతాం.గొంతులో తేడాగా ఉన్నా ముక్కులో గడబిడ ఉన్నా చాలా చిరాకుగాను నిసత్తుగాను ఉంటుంది. దగ్గు,జలుబు తగ్గేదాకా ప్రశాంతత ఉండదు. ఇవి శరీరంలో సమస్యలకు కారణం అవుతాయి.

దగ్గు,జలుబుతో పాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఇలా ఒక్కొకటి వచ్చేస్తూ ఉంటాయి.కాబట్టి… దగ్గు, జలుబు రాగానే మనం అలర్ట్ అవ్వాలి. శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉంటే ఇటువంటి సమస్యలు ఏమి ఉండవు.

ఇప్పుడు చెప్పే చిట్కా శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. ఒక బౌల్ లో పావు స్పూన్ శొంఠి పొడి,పావు స్పూన్ మిరియాల పొడి,పావు స్పూన్ పసుపు,ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెద్దవారు అయితే ఒక స్పూన్ చిన్నవారు అయితే అరస్పూన్ ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."