Healthhealth tips in telugu

Vayyari Bhama:ఈ మొక్క మీ ఇంటిలో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే పీకేయండి…ఎందుకంటే…

Vayyari Bhama Plant in Telugu : వయ్యారిభామ అనే అందమైన పేరు కలిగిన ఈ మొక్క చాలా ప్రమాధకరమైన కలుపు మొక్క. ఇది చాలా సులువుగా వ్యాపిస్తుంది. చాలా త్వరగా పెరుగుతుంది. సుమారు 3 కి.మీల మేర గాలిలో ఈ మొక్క విత్తనాలు వ్యాపిస్తాయి. ఇంత వేగంగా అల్లుకపోయే మొక్క మరేదీ లేదని చెప్పవచ్చు.పొలాల్లో పెరిగే పంటలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా మానవుల ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది.
vayyari bhama plant
ఈ మొక్క మొలకెత్తిన నాలుగు వారాల్లోనే ముప్పై వేల నుండి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు సుమారు రెండు సంవత్సరాల వరకు నిద్రావస్థలో ఉండి అనుకూల సమయం వచ్చినప్పుడు మొలకెత్తుతాయి. ఈ మొక్క స్రవించే కొన్ని రసాయనాల వల్ల పంట దిగుబడి మందగిస్తుంది. ఈ మొక్క పువ్వుల నుండి వచ్చే పుప్పొడి రేణువులు కూడా ప్రమాదమే.

ఈ పువ్వు పుప్పొడిలో ఉండే తామర పురుగులు గాలి ద్వారా వ్యాప్తి చెంది పంటను నాశనం చేస్తాయి. ఈ మొక్క అవశేషాలు కాళ్లకు, చేతులకు తగిలినా ఎలర్జీ (దురద) వస్తుంది. పూత దశలో గాలి ద్వారా ఎగిసిపడే దీని పుప్పొడిని మనుషులు పీలిస్తే ఆస్తమ బారిన పడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది.పసిపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

పశువులు గడ్డితో పాటు ఈ మొక్కను మేసినట్లయితే అనారోగ్యం బారిన పడతాయి.వయ్యారిభామను తిన్న పశువుల పాలను తాగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఇది పంట పొలంలో పెరిగితే పంటకు వాడే రసాయన, సేంద్రియ ఎరువుల్లోని 60 శాతం సారాన్ని ఈ మొక్కనే తీసుకుని పంట ఎదుగుదలను పూర్తిగా నివారిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u