Healthhealth tips in telugu

Pomegranate Leaves :ఈ ఆకులు అందరికీ తెలుసు… కానీ ఈ ఆకుల్లో ఉన్న రహస్యం ఎవరికీ తెలీదు

Danimma Leaf Health Benefits in Telugu :మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియక పెద్దగా పట్టించుకోము.

దానిమ్మ గింజలను అందరూ ఇష్టంగా తింటారు అలాగే దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను దానిమ్మ బెరడును ఉపయోగిస్తున్నారు.

చలికాలంలో జలుబు దగ్గు సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి దానిలో శుభ్రంగా కడిగిన 6 దానిమ్మ ఆకులను వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి ఈ నీటిని వడగట్టి ఉదయం సాయంత్రం తీసుకుంటే దగ్గు జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.

అంతేకాకుండా అధిక బరువు సమస్య చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన చిగుళ్ల సమస్యలు నోటిలో పుండ్లు తొలగిపోతాయి. దానిమ్మ ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి పట్టిస్తే నల్లని మచ్చలు,మొటిమలు తగ్గుతాయి అలాగే చర్మానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి

దానిమ్మ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ పొడిని మూడు గ్రాములు తీసుకొని వేడి నీటిలో కలిపి తాగితే కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."