Healthhealth tips in telugu

Acidity Remedies:గ్యాస్,ఎసిడిటి,కడుపులో మంట,కడుపుఉబ్బరం,మలబద్దకాన్ని శాశ్వతంగా మాయం చేసే చిట్కా

Acidity Remedies:గ్యాస్,ఎసిడిటి,కడుపులో మంట,కడుపుఉబ్బరం,మలబద్దకాన్ని శాశ్వతంగా మాయం చేసే చిట్కా.. స‌రైన స‌మ‌యానికి ఆహారం తీసుకోక‌పోవ‌డం, స్థూల‌కాయం, ఒత్తిడి… ఇలా కార‌ణాలు ఏవైనా కావచ్చు.. నేడు చాలా మంది గ్యాస్, అసిడిటీ స‌మ‌స్యలతో బాధ‌ప‌డుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందుల‌ను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడం వలన సమస్యలు తగ్గినా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు.
Acidity home remedies
సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే గ్యాస్ సమస్య తగ్గించుకోవటానికి ఈ రోజు చాల ఎఫెక్టివ్ గా పనిచేసే ఇంటి చిట్కాలను తెలుసుకుందాం. గ్యాస్ సమస్యను ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు వాంతులు, కడుపు నొప్పి మరియు ఛాతీ చికాకు పొట్టలో గ్యాస్ ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ జీలకర్ర, ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

జీలకర్రలో కొన్ని ముఖ్యమైన నూనెలు లాలాజల గ్రంథులను ఉత్తేజపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్ సమస్య లేకుండా చేస్తాయి. దాల్చినచెక్కలోని నూనెలు శక్తివంతమైన యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."