Healthhealth tips in telugu

Curry Leaves:పరగడుపున 10 ఆకులను తింటే అధిక బరువు,జీర్ణ సమస్యలు తగ్గి డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది

Curry leaves health benefits In telugu : కరివేపాకును ప్రతిరోజు వంటల్లో వేసుకుంటాం. కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది కూరలో కరివేపాకును తీసి పాడేస్తూ ఉంటారు. కరివేపాకు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే. చాలా ఆశ్చర్యపోతారు. రోజుకి పది కరివేపాకు ఆకులను తింటే చాలా మంచిది లేదా కరివేపాకు టీ తయారు చేసుకుని తాగవచ్చు.
curry leaves
పది కరివేపాకు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి, ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక కరివేపాకు ఆకులను వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగాలి.లేదా కరివేపాకు ఆకులను కూడా తినవచ్చు.

ఈ విధంగా తాగటం వల్ల జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, మలబద్ధకం వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది ఒత్తిడి తగ్గి ప్రశాంతం గా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది

గర్భిణీలు ఈ టీ తాగితే వాంతులు వికారం తగ్గుతాయి. అలాగే కొంతమంది ప్రయాణాలు చేసినప్పుడు వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణం చేయటానికి ముందు కరివేపాకు టీ తాగితే ప్రయాణాల్లో వాంతులు అవ్వకుండా ఉంటాయి. అధిక బరువును తగ్గించటంలో కూడా చాలా సహాయపడుతుంది.

కరివేపాకులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఉదయం పరగడుపున కరివేపాకు తింటే శరీరంలో ఐరన్ పెరిగి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి.

కరివేపాకులో డీటాక్స్ గుణాలు ఉండటం వలన ఉదయం పరగడుపున తింటే శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్ బయటకు పోతాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

కరివేపాకులో ఉండే యంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం పై ఉన్న ముడతలు, మొటిమలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది.

కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లుమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకొని రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది.

అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు రెగ్యులర్ డైట్ లో కరివేపాకుని చేర్చుకుంటే మంచిది.

కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.

మనకి చాలా తక్కువ ఖర్చులో చాలా విరివిగా లభించే కరివేపాకును తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u