Strawberry:వారంలో 3 సార్లు తింటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…అసలు నమ్మలేరు
strawberry Health benefits in telugu : చూడటానికి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీ అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఈ సీజన్లో ప్రస్తుతం విరివిగానే లభిస్తున్నాయి. కాస్త ధర ఎక్కువైనా దానికి తగ్గట్టుగా లాభాలను అందిస్తుంది. స్ట్రాబెర్రీ లో ఆరెంజ్ కన్నా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులు రాకుండా చేస్తుంది.
ముఖ్యంగా సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. దాంతో యవ్వనంగా కనిపిస్తారు. స్ట్రాబెర్రీ లో షుగర్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు. ఆల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా చేయడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.
దీనిలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు,పొటాషియం గుండెకు రక్తసరఫరా మెరుగుపరచి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగు పడటమే కాకుండా కంటి సమస్యలు తగ్గుతాయి. కంటిలో శుక్లాలు ఏర్పడకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
స్ట్రాబెరీలో యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ సమృద్దిగా ఉండుట వలన కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు తరచుగా స్ట్రాబెర్రీలను తింటే అంటే వారంలో మూడు సార్లు తింటే ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. స్ట్రాబెరీలో ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. ఇది ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడమే కాకుండా గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
స్ట్రాబెర్రీలలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్స్‌తో పాటు విటమిన్-సి ఉంటుంది. యాంటిఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, కణజాల నష్టాన్ని తగ్గించడం ద్వారా కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి అవసరమైన విటమిన్-సి ని అందిస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ కణాలకు మద్దతు ఇస్తుంది. విటమిన్-సి టి కణాలు, బి-కణాల పెరుగుదలను ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇవి తెల్ల రక్త కణాలు, వ్యాధిని కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా, క్యాన్సర్‌తో పోరాటం చేయటానికి సహాయపడతాయి.
ఇతర పండ్లతో పోలిస్తే స్ట్రాబెర్రీలలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ తక్కువ శాతం ఉంటుంది. ఉదాహరణకు, ఒక కప్పు ద్రాక్షలో 23 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. ఒక కప్పు స్ట్రాబెర్రీలు 7 గ్రాముల సహజ చక్కెరను అందిస్తాయి. అందుకే డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. కాబట్టి వారంలో రెండు సార్లు స్ట్రాబెర్రీలు తింటే మంచి పలితాన్ని పొందవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u