Hair Growth Tips:జుట్టుకి ఒక్కసారి స్ప్రే చేస్తే జుట్టు రాలటం,పొడి జుట్టు,చుండ్రు సమస్య తొలగిపోతాయి
Fenugreek seeds and Onion Hair Fall Tips In telugu : మనలో చాలా మంది మారిన జీవనశైలి మరియు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలడం, చుండ్రు, స్ప్లిట్ , పొడిబారిన జుట్టు, బట్టతల వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి సులభంగా తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల మెంతులను నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెంతుల నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని తొక్క తీసి తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం,మెంతుల నీరు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేయాలి. అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
ఉల్లిపాయ,మెంతులు, ఆముదం ఈ మూడు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి వాటిలో ఉన్న లక్షణాలు సహాయ పడతాయి. వీటిని పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ మూడు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కొల్లాజెన్ అవసరం. కొల్లాజెన్ ఆరోగ్యకరమైన చర్మ కణాలను మరియు జుట్టు పెరుగుదల చక్రాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసాన్ని తలకు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి హెయిర్ ఫోలికల్స్‌కు అవసరమైన పోషకాలు మరియు ఆక్సిజన్ అందేలా చూస్తుంది. ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కాల్ప్‌ను ఉపశమనం చేస్తాయి మరియు జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగించే ఏదైనా మంట లేదా చికాకును తగ్గిస్తుంది.
మెంతులలో ఉండే ప్రోటీన్ జుట్టు తంతువుల నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది మరియు జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, ఇది ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టు తంతువుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
మెంతులలో ఉండే విటమిన్లు బి1 (థయామిన్), బి3 (నియాసిన్), మరియు బి6 (పిరిడాక్సిన్) తలకు పోషణనిస్తాయి. సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. సెబమ్ అనేది స్కాల్ప్ ను తేమగా ఉంచి, పొడి, పెళుసుగా ఉండే జుట్టును నివారిస్తుంది. వెంట్రుకల కుదుళ్లకు ఆక్సిజన్ మరియు పోషకాల పంపిణీకి తోడ్పడుతుంది. స్కాల్ప్ ఇరిటేషన్ మరియు దురదను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u