Healthhealth tips in telugu

Pomegranate Peel:దానిమ్మ తొక్కలను పాడేస్తున్నారా… అయితే ఈ ప్రయోజనాలు మిస్సవుతున్నట్లే!

Pomegranate Peel Health Benefits In telugu : దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ పండును చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టంగా తింటారు. మనలో చాలా మంది పండ్లను తిని తొక్కలను పాడేస్తూ ఉంటారు. అలా పాడేసే తొక్కలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవాలి.

దానిమ్మపండు లాగానే, దాని తొక్క కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని తెలిస్తే మీరు నమ్మలేరు. కానీ, ఇది నిజమేనంటున్నారు ఆయుర్వేద ఆరోగ్యనిపుణులు. దానిమ్మ తొక్కలు సాధారణంగా పడవేస్తుంటాం.. కానీ ఆయుర్వేదం దాని సాధారణ ఉపయోగం వివిధ ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతుంది. దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఈ పదార్థాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ పొడి చర్మ సమస్యలను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ పొడిలో నిమ్మరసం లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. మొటిమలు ఉన్న ప్రదేశంలో ఈ పేస్ట్ ని రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మూడు రోజుల పాటు ఈ విధంగా చేస్తే మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.

రెండు స్పూన్ల పొడిని తీసుకోని దానిలో పెరుగు కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని మీ ముఖం మరియు మెడకు రాసి పది నిముషాలు అయిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఈ తోక్కలలో ఎల్లగిక్ యాసిడ్ ఉండుట వలన చర్మంలో తేమను లాక్ చేస్తుంది. అలాగే చర్మాన్ని సున్నితంగా మరియు మృదువుగా ఉంచుతుంది.

జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో దానిమ్మ తొక్కలపొడి కలిపి జుట్టుకి బాగా పట్టించి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది.

దానిమ్మ తొక్క పొడి మార్కెట్‌లో దొరుకుతుంది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ఇంట్లో దానిమ్మ తొక్క పొడిని తయారు చేయాలనుకుంటే ముందుగా పండు నుండి పై తొక్కను తొలగించుకోవాలి. ఆ తర్వాత 2-3 రోజులు నేరుగా సూర్యకాంతిలో తొక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన తర్వాత మెత్తటి పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని శుభ్రమైన గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు.

కాబట్టి దానిమ్మ తొక్కల పొడిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మనం పాడేసే ఈ దానిమ్మ తొక్కలో ఉన్న ప్రయోజనాలను తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి వాడటానికి ప్రయత్నం సెహ్యండి. అప్పుడే ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.