Homemade shampoo:ఈ ఆకులతో షాంపూ తయారుచేసి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Homemade shampoo : ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ లో ఎక్కువగా కెమికల్స్ ఉండుట వలన జుట్టు బలహీనంగా మారుతుంది. కాబట్టి ఇంట్లోనే నేచురల్ గా షాంపూని తయారుచేసుకొని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గుప్పెడు కరివేపాకు ఆకులను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో కరివేపాకు పేస్ట్ వేసి, ఆతర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత 10 నుంచి 15 కుంకుడు కాయలను లోపల గింజలు తీసేసి వేయాలి. 10 నిమిషాల పాటు మరిగించాలి.
కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడూ బాగా చేతులతో కలిపి రసం తీసుకుని వడకట్టాలి. అంతే షాంపూ తయారయింది. ఈ షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కుంకుడుకాయ అనేది జుట్టు బాగా పొడవుగా, నల్లగా ,ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
ఉసిరి పొడి జుట్టుకి సంబందించి అన్నీ రకాల సమస్యలను తగ్గించి జుట్టు రాలకుండా కాపాడుతుంది. కరివేపాకు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. వారంలో రెండు సార్లు ఈ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం చాలా తొందరగానే కనపడుతుంది.
కరివేపాకు, కుంకుడు కాయలు రెండు కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఏదైనా మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో కుంకుడు కాయల వాడకం తగ్గింది. అయితే కుంకుడు కాయలు వాడటం వలన జుట్టుకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి.
కుంకుడు కాయలలో న్యాచురల్ సపోనిన్‌లు ఉంటాయి. ఇవి న్యాచురల్ క్లెన్సర్స్. ఇవి తల, జుట్టులోని నూనెలను తొలగించకుండా జుట్టును సున్నితంగా శభ్రపరుస్తాయి. కుంకుడు కాయలు సున్నితమైన జుట్టు, డ్రైహెయిర్ ఇలా ఎలాంటి జుట్టు ఉన్నా పర్షెక్ట్‌గా సరిపోతాయి.
షాంపూలలో ఉండే సల్ఫేట్‌లు, పారాబెన్‌లు, సిలికాన్‌ల వంటి కఠినమైన రసాయనాలు కుంకుడు కాయలలో ఉండవు. కుంకుడు కాయలలో హానికరమైన పదార్థాలు ఉండవు. ఇవి తలస్నానానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
కుంకుడు కాయలలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తాయి. ఇవి మీ తలను ఆరోగ్యాంగా ఉంచుతాయి. శుభ్రమైన, ఆరోగ్యకరమైన తల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కరివేపాకులో ఉండే అమినో యాసిడ్స్ జుట్టును మెరిసేలా చేస్తాయి. కరివేపాకులోని ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u