Healthhealth tips in telugu

Diabetes :మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రింక్ తాగితే ఏమి అవుతుందో తెలుసా ?

Diabetes :మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రింక్ తాగితే ఏమి అవుతుందో తెలుసా .. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవల్సిందే. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ ఉన్నప్పుడూ తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Diabetes In Telugu
మన ఇంటిలో తయారుచేసుకొనే హెర్బల్ డ్రింక్స్ చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్స్ లో ఏదో ఒకదాన్ని ప్రతి రోజు తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడతాయి. ఎనిమిది తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

వేప ఆకులు కూడా డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడతాయి. నాలుగు తులసి ఆకులను నీటిలో మరిగించి తీసుకోవాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. అలాగే కరివేపాకు కూడా డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. అరస్పూన్ మెంతులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగేయాలి.

కాకరకాయ కూడా డయాబెటిస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది. కాకరకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి నీటిని పోసి జ్యూస్ తయారుచేసుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలను సన్నగా కోసి మిక్సీ పట్టి ఆ రసాన్ని పిండుకోవాలి. ఈ రసంలో ఒక గ్లాసు వేడి నీటిని పోసి అందులో కొద్దిగా నిమ్మరసం ఉప్పు వేసి కలిపి తాగితే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. ఇప్పుడు చెప్పిన చిట్కాలలో మీకు వీలును బట్టి ఒక చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్ చూసుకుంటూ ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."