Healthhealth tips in telugu

Diabetes:అర గ్లాస్ తాగితే చాలు…షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది…

Diabetes magical drink :ఉసిరి మరియు పసుపు అనేవి డయాబెటిస్ నియంత్రణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె, కిడ్నీ, కంటికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
Diabetes diet in telugu
ఒక రకంగా చెప్పాలంటే డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో తప్పనిసరిగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవటానికి మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ రెమిడి ఫాలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
usiri benefits in telugu
ఒక బౌల్ లో ఎండిన ఉసిరికాయ ముక్కలు, ఒక చిన్న కప్పు నీటిని వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఆ తర్వాత నానపెట్టి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలను నీటితో సహ వేయాలి. ఆ తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేయాలి. .
pasupu benefits
ఈ నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి గంట ముందు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలో కొవ్వు కరగటానికి కూడా సహాయపడి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
Diabetes In Telugu
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఉసిరిలో క్రోమియం ఉండుట వలన ఇన్సులిన్ వలే పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పసుపులో పుష్కలంగా లభించే కర్క్యుమిన్ కారణంగా డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కర్క్యుమిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."