Kitchenvantalu

Bottle gourd roti: అల్పాహారంలోకి సొరకాయ చపాతీ.. కర్రీ కూడా అక్కర్లేదు…

Bottle gourd roti: అల్పాహారంలోకి సొరకాయ చపాతీ.. కర్రీ కూడా అక్కర్లేదు… దూది కంటే మెత్తని సొరకాయ చపాతీ.. కర్రీ కూడా అక్కర్లేదు… అల్పాహారంలోకి చపాతీతో ఏదైనా కర్రీ తినడం చాలా మందికి ఇష్టమే. కర్రీ చేసే సమయం లేనప్పుడు సొరకాయ చపాతీలు చేసి చూడండి.

ఒంటికి చలువ చేసే సొరకాయలతో, గారేలు చేసుకుంటాం. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసుకదా. అలాగే సొరకాయ చపాతీలు ట్రై చేసి ఉంటే, మెత్తగా భలే రుచిగా ఉంటాయి. పైగా హెల్తీ కూడా ఇంకెందుకు ఆలస్యం సొరకాయ చపాతి తయారీ విధానం తెల్సుకుందాం రండి.

కావాల్సిన పదార్దాలు
గోధుమపిండి – 2 ½ కప్స్
తురిమిన సొరకాయ – 2 కప్పులు
ఉప్పు – తగినంత
గరం మసాలా – 1/2 టీ స్పూన్
తరిగిన పచ్చిమిర్చి – 1/2 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – 1/2 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గోధుమపిండి వేసి, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
2. అందులోకి తురిమిన సొరకాయ పచ్చిమిర్చి, గరం మసాల, పెప్పర్ పౌడర్, ఇంగువ, 2 టేబుల్ స్పూన్ అయిల్, వేసుకుని, బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు కొంచం కొంచం నీరు కలుపుతూ, పిండిని మెత్తగా చపాతి పిండిలా చేసుకోవాలి.

4. కలుపుకున్న పండి ముద్దకి, నూనె రాసి, కాసేపు పక్కన పెట్టాలి.
5. 15 నిముషాల తర్వాత పిండిముద్దలను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పొడి పిండిని చల్లుతూ, మెల్లిగా, చపాతీ లాగా వత్తుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, ఒకోక్క చపాతిని రెండు వైపులా వేయించి, కొద్దిగా నూనె యాడ్ చేసుకుని, బాగా రోస్ట్ చేసుకోవాలి.
7. అంతే సొరకాయ చపాతీలు రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."