Beauty Tips

Banana For Skin:జిడ్డు చర్మం ఉన్నవారికి అరటిపండు పేస్ స్క్రబ్

Banana For Skin:జిడ్డు చర్మం ఉన్నవారికి అరటిపండు పేస్ స్క్రబ్.. అరటిపండు తినడం ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అరటిపండు చర్మాన్ని మృదువుగా, మెరుసేలా చేయడమే కాకుండా చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. అరటిపండు ఫేస్ ప్యాక్ ముఖంలోని జిడ్డును తొలగిస్తుంది. అలాగే, ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది.

జిడ్డు చర్మం కలవారు మేకప్ చేసుకున్న కొంతసేపటికే జిడ్డుగా మారిపోతుంది. జిడ్డు సమస్యను వదిలించుకోవడానికి అరటిపండు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అరటిపండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా సహాయాపడుతుంది. ఇప్పుడు అరటిపండు,పాలు,ఓట్ మీల్ ఉపయోగించి స్క్రబ్ తయారుచేసుకుందాం.

అరటిపండులో పొటాషియం మరియు విటమిన్ A, B, E వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన చర్మంలో జిడ్డును సమర్థవంతంగా తొలగించి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. పాలు సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మానికి పోషణ,తేమను అందిస్తుంది. ఈ స్క్రబ్ చర్మ ఎక్స్ ఫ్లోట్,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తొలగించటానికి సహాయం చేస్తుంది.

బాగా పండిన ఒక అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక స్పూన్ పాలు, రెండు స్పూన్ల ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు వృత్తాకార కదలికలతో మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."