Beauty Tips

Multani Mitti Benefits : మీ చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇవే

Multani Mitti Benefits : మీ చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇవే..మీ చర్మం కాంతివంతంగా, మృదువుగా మరియు అందంగా ఉండటానికి క్రీమ్‌ లను రాస్తే సరిపోదు. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.

దీని కోసం 15 రోజులకు ఒకసారి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఖరీదైన చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బ్యూటీ పార్లర్ కి వెళ్లేంత సమయం దొరకదు.అటువంటి పరిస్థితులలో, ఇంట్లో కూడా చాలా సులభమైన చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల ముల్తానీ మిట్టి కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని మందపాటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఆరిపోయే వరకు ముఖంపై ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.

ముల్తానీ మిటీ మొటిమలను తగ్గించడమే కాకుండా, ఓపెన్ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఓపెన్ రంధ్రాల నుండి అదనపు నూనె మరియు మురికిని కూడా తొలగిస్తుంది.

ముల్తానీ మిట్టిని అప్లై చేయడం వల్ల ముఖం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ముల్తానీ మట్టి అప్లికేషన్ వదులుగా తెరిచిన రంధ్రాలను బిగించడానికి సహాయపడుతుంది. ముఖానికి మెరుపు వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల చర్మంపై మచ్చలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని ముఖం మెరిసేలా చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."