Hair Growth Tips: జుట్టు పెళుసుగా మారి ముక్కలు అవుతుందా.. ఈ చిట్కా ఫాలో అయితే సరి
ఇది కూడా చూడండి:Cooking Oils:రుచికరమైన వంటలు చేసేందుకు సరిపోయే కుకింగ్ ఆయిల్స్ ఇవే.. బెస్ట్ ఆఫర్స్..
Fenugreek seeds and pepper Hair Fall Oil: జుట్టు పెళుసుగా మారి ముక్కలు అవుతుందా.. ఈ చిట్కా ఫాలో అయితే సరి.. వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.ఈ సీజన్ లో జుట్టు పట్ల శ్రద్ద పెట్టాలి. అంతేకాక దురద, చుండ్రు వంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలు తగ్గటానికి మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన వస్తువులతో తయారుచేసుకొనే నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెను తయారుచేయటం చాలా సులువు.
మిక్సీ జార్ లో ఒక స్పూన్ కలోంజి విత్తనాలు, ఒక స్పూన్ మెంతులు, అర స్పూన్ మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక గిన్నెలో 100 ml కొబ్బరి నూనె పోసి దానిలో మనం తయారు చేసుకున్న పొడిని కలిపి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఈ నూనె బాగా మరిగిన తర్వాత రంగు మారుతుంది.
అప్పుడు పొయ్యి మీద నుంచి కిందకు దించి చల్లారాక వడగట్టి సీసాలో నిలువ చేసుకోవచ్చు. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. రెండు గంటల పాటు అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
కలోంజి గింజలు జుట్టు పెరగడానికి బాగా సహాయపడతాయి. మెంతులు జుట్టుకు ఒక కండిషనర్ గా పని చేస్తాయి. దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. మిరియాలు కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది.
జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పిన ఈ రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ