Kitchenvantalu

Cheese Garlic Paratha:వెల్లుల్లి పరోటా రుచిచూస్తే వదిలిపెట్టరు..

Cheese Garlic Paratha:వెల్లుల్లి పరోటా రుచిచూస్తే వదిలిపెట్టరు..ఆలు,ఎగ్, వెజిటిరేయన్ పరాటా లు చేస్తుంటాం. కాని గార్లిక్ పరాటా ఎప్పుడైనా ట్రై చేసారా. లేదంటే ఈ సారి చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ పిండి – 2 కప్పులు
ఉప్పు – చిటికెడు
చీచ్ తురుము – 1 కప్పు
పచ్చిమిర్చి తురుము – 2-3
వెల్లుల్లి – 3-4 రెబ్బలు
కారం- కొద్దిగా
జీలకర్ర పొడి – చిటికెడు
నెయ్యి – పరాటాలు కాల్చుకోవడానికి

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోని అందులోకి గోధుమ పిండి ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోని చపాతి పిండిలా కల్పుకోవాలి.
2.కలుపుకున్న పిండిని తడిగుడ్డతో కప్పి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3.వేరొక బౌల్ లో చీజ్ తురుము,సన్నగా తరిగిన పచ్చిమిర్చి,తురుమిన వెల్లుల్లి,ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి.
4.నానిన గోధుమ పిండిని ఉండలుగా తీసుకోని చపాతి పీట పై కర్రతో రోల్ చేసుకోవాలి.

5. వత్తుకున్న పిండి మద్యలో కలుపుకున్న చీజ్ మిశ్రమాన్ని ఒక చెంచాడు వరకు వేసుకోని అంచులను మూసి..మరలా ముద్దగా చేసుకోని పల్చని పరాటాలా తాల్చుకోవాలి.
6.స్టవ్ పై పెనం పెట్టుకోని వేడెక్కిన పెనంపై పరాటా వేసి అంచులకు నూనె వేస్తు కాల్చుకోవాలి.
7.ఒక వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోని చీస్ కరిగే వరకు కాల్చుకోవాలి.
8.రెండు వైపుల ఎర్రగా కాల్చుకోని వేడి వేడి గా సర్వ్ చేసుకోవడమే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."