Kitchenvantalu

Garlic Tips : ఇలా చేస్తే..వెల్లుల్లి ఫ్లేవర్ పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి

Garlic Tips in telugu :ఇలా చేస్తే..వెల్లుల్లి ఫ్లేవర్ పోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి వెల్లుల్లి వాడకం చాలా ఎక్కువ అయింది. వెల్లుల్లిని సాదారణంగా అరకేజీ, పావు కేజీ చొప్పున కొంటాం. అవి ఒక్కోసారి తొందరగా పాడయ్యిపోతాయి. ఒక్కోసారి తక్కువ ధరకు వచ్చాయని ఎక్కువ మొత్తంలో కూడా కొంటూ ఉంటాం.

వెల్లుల్లిలో దాదాపు 11 రకాలు ఉన్నాయి. వెల్లుల్లిని కొనేటప్పుడు గుండ్రంగా ఉండేవి, పెద్ద రెబ్బలు ఉండేవి కొనుక్కోవాలి. రెబ్బలు గట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, మొలకెత్తుతున్నా అలాంటి వెల్లుల్లిని అసలు కొనకూడదు. వెల్లుల్లిని రెబ్బలు విడగొట్టకుండా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఒకవేళ రెబ్బలు విడదీస్తే.. 10 రోజులకు మించి నిల్వ ఉండవు. కొంత మంది వెల్లుల్లిని ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. అయితే వాటిని బయటకు తీసిన కొన్ని రోజుల్లోనే మొలకలు వస్తాయి. అందువల్ల ఫ్రిజ్ లో పెడితే…గాలి చేరని సీసాలో ఉంచి.. ఫ్రిజ్‌లో 2 వారాల వరకూ నిల్వ చేయవచ్చు. అయితే ఫ్రిజ్ లో పెట్టటం వలన రుచి,వాసన తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."