Curry Leaves For Hair:కరివేపాకుతో ఇలా చేస్తే చాలు జన్మలో జుట్టు రాలమన్న రాలదు…ఇది నిజం
Curry Leaves For Hair:కరివేపాకుతో ఇలా చేస్తే చాలు జన్మలో జుట్టు రాలమన్న రాలదు…ఇది నిజం మనం ప్రతి రోజు కూరల్లో కరివేపాకు వాడుతూ ఉంటాం. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు.
ఈ సమస్య ఆడవారి లోనే కాకుండా మగవారిలో కూడా ఉంది. జుట్టు రాలడానికి పోషకాహార లోపం., టెన్షన్, ఒత్తిడి, చుండ్రు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. జుట్టు రాలే సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. మనలో చాలా. మంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
వాటి కోసం వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాల ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో గుప్పెడు కరివేపాకు,ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
బాగా మరిగాక ఆ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
ఈ రెమిడీలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ