Atukula Banana Shake:పిల్లలు ఆకలన్నప్పుడు అటుకులతో ఇలా చేసివ్వండి గ్లాస్ మొత్తం ఖాళీ..
Atukula Banana Shake:పిల్లలు ఆకలన్నప్పుడు అటుకులతో ఇలా చేసివ్వండి గ్లాస్ మొత్తం ఖాళీ.. అటుకులలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అటుకులను తినమని పిల్లలకు చెప్పితే పెద్దగా తినటానికి ఇష్టపడరు. ఇలా milk shake చేస్తే ఇష్టంగా తాగుతారు.అటుకులు, అరటి,పంచదార, పాలను కలిపి, హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్,అవల్ మిల్క్, ఎలా చేయాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మందపాటి అటుకులు – 1/2కప్పు
చల్లని పాలు – 1/2లీటర్
అరటి పంట్లు – 4
పంచదార – 4 టేబుల్ స్పూన్స్
వేరు శనగగుండ్లు – 1/4కప్పు
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
హార్లిక్స్ లేదా బూస్ట్ లేదా బోర్న్ వీటా – 1 టేబుల్ స్పూన్
టూటీ ఫ్రూటీ – ½ టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టి, అటుకులను కరకరలాడేట్టు ,వేపుకోవాలి.
2.అరటిపండులో పంచదార వేసి, మెత్తగా, చేసుకోవాలి.
3.పేస్ట్ లా చేసుకున్న అరటిపండులో పాలు పోసి, మిక్స్ చేసుకుని, అటుకులు వేసి కలుపుకోవాలి.
4.అటుకులు కలుపుకున్నాక, వెంటనే, సగం గ్లాస్ వరకు, అటుకులు వేసుకుని, ఆ తర్వాత పల్లీలు, జీడిపప్పు, వేసుకుని,
ఆ పైన, మిగిలిన అటుకుల పాలతో నింపుకోవాలి.
5.చివరగా గ్లాస్ పైన, కొన్ని పల్లీలు, జీడిపప్పు, టూటీఫ్రూటీ, హార్లిక్స్, వేసి వెంటనే సెర్వ్ చేసుకోవాలి.
6. అంతే మలబార్ స్పెషల్ అవల్ మిల్క్ రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ