Fridge Door: ఫ్రిజ్ డోర్‌లోని రబ్బరు మురికిగా మారిందా? అయితే ఈ చిట్కాతో ..
Fridge Door: ఫ్రిజ్ డోర్‌లోని రబ్బర్‌కి మురికిపట్టిందా? ఇలా చేస్తే క్షణాల్లో కొత్తదానిగా.. ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లు లేదు. ప్రతి ఒక్కరికి ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఫ్రిజ్ ని శుభ్రం చేసుకొనే చిట్కాను తెలుసుకుందాం. ఫ్రిజ్ డోర్ మీద ఉండే రబ్బరు త్వరగా మురికి పడుతుంది. మురికి పట్టిన రబ్బరును శుభ్రం చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది మురికి పట్టిన రబ్బరును శుభ్రం చేయరు.
దాంతో ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అది మురికిగా కనబడటమే కాకుండా ఒక రకమైన వాసన వస్తుంది. అంతేకాకుండా ఈ రబ్బర్ ను శుభ్రం చేయకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎలా శుభ్రం చేయాలి అనేది చూద్దాం.
మురికి పట్టిన రబ్బరు మీద మనం రెగ్యులర్ గా ఉపయోగించే టూత్ పేస్ట్ ను రాసి శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి దానిలో ఐదు చుక్కల వెనిగర్ వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో నింపి మురికి పట్టిన రబ్బరు మీద స్ప్రే చేసి క్లాత్ తో తుడిస్తే మురికి వెంటనే తొలగిపోతుంది.
నిమ్మ చెక్కతో రుద్దిన కూడా మురికి చాలా తొందరగా తొలగిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్న ఈ చిట్కాలను ఫాలో అయ్యి ఫ్రిజ్ డోర్ రబ్బర్ ను శుభ్రం చేస్తే ఫ్రిజ్ శుభ్రం అవటమే కాకుండా ఎటువంటి సమస్యలు ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ