Healthhealth tips in telugu

Weight Loss:పసుపును ఇలా వాడితే శరీరంలో కొవ్వు చాలా వేగంగా కరిగి బరువు తగ్గుతారు

weight loss tips in telugu :పసుపును ఇలా వాడితే శరీరంలో కొవ్వు చాలా వేగంగా కరిగి బరువు తగ్గుతారు..పూర్వ కాలం నుంచి పసుపును వంట‌ల్లోనూ, ఆయూర్వేదంలోనూ, పూజ‌లోనూ, సౌందర్య చిట్కాలలో ఇలా అనేక ర‌కాలుగా ఉప‌యోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పసుపు సర్వ రోగ నివారిణి అని చెప్పవచ్చు. పసుపులో ఉన్న లక్షణాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఒక దివ్యౌష‌ధంగా పనిచేస్తుంది.

పసుపును ఇప్పుడు చెప్పే విధంగా వాడితే చాలా అద్భుతంగా పనిచేయటమే కాకుండా అధిక బరువు తగ్గటమే కాకుండా ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి అర స్పూన్ పసుపు,చిన్న అల్లం ముక్క,పావు స్పూన్ లో సగం మిరియాల పొడి,సగం నిమ్మచెక్కను నాలుగు బాగాలుగా చేసి వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత గ్లాస్ లోకి వడకట్టి తేనె కలుపుకొని ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా తాగటం వలన శరీరంలో అదనపు కొవ్వు కరగటమే కాకుండా శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ఈ డ్రింక్ ని 15 రోజుల పాటు తీసుకుంటే వచ్చే తేడాను గమనించి చాలా ఆశ్చర్యపోతారు.

ఈ డ్రింక్ బరువును తగ్గించటమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. ఒక్కసారిగా బరువు తగ్గిపోకూడదు. పసుపు బరువును తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."