Kitchenvantalu

Kitchen Hacks:కిచెన్ ప్లాట్‌ఫామ్‌ జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే.. ఇలా చేస్తే సరి..

Kitchen Cleaning Tips in telugu:మనం ప్రతి రోజు వంటగదిలో వంట చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు కిచెన్ ప్లాట్‌ఫామ్‌ జిడ్డు పడుతుంది. దాన్ని పట్టించుకోకపోతే మరింత జిడ్డు పెరిగి శుభ్రం చేయటం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది.

వంటగది శుభ్రంగా ఉండాలంటే ముందుగా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. వంటగదిలో వంట చేసే సమయంలో కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌ లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ శుభ్రంగా లేకపోతే వంట చేయటానికి కష్టంగా ఉంటుంది.

అలాగే బొద్దింకలు,ఈగలు వంటివి వచ్చి తెగ ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సీజన్ లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వంట పూర్తీ అయినా తర్వాత నీళ్లలో వెనిగర్‌ కలిపి కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ ని శుభ్రం చేస్తే సరిపోతుంది.

కిచెన్ లో నూనె ఒలికినప్పుడు గోధుమ పిండి లేదా వంటింటిలో ఉండే ఏ పిండిని అయినా ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డు లేకుండా శుభ్రం పడుతుంది.

కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. బేకింగ్‌ సోడా వేసిన నీళ్లతో తుడిస్తే వెంటనే తొలగుతాయి. దుర్వాసన కూడా ఉండదు. దీన్ని శుభ్రం చేసేందుకు బ్లీచింగ్‌, అమోనియా వంటి వాటిని అస్సలు వాడకూడదు. ఒకవేళ వాటిని ఉపయోగిస్తే క్యాబినేట్‌కున్న రంగులు, టైల్స్‌ దెబ్బతింటాయి.

కూరగాయలు తరిగిన తర్వాత వాటి చెత్త అంతా ఎప్పటికప్పుడు ఒక డబ్బాలో వేసుకొని ఆ తర్వాత చెత్తడబ్బాలో పాడేయాలి. ఇలా చేస్తే కిచెన్ ప్లాట్‌ఫామ్‌ మీద తేమ,మరకలు లేకుండా శుభ్రంగా ఉంటుంది.

వంట పూర్తైన తర్వాత.. సింక్ శుభ్రం చేసుకుంటే.. వైరస్‌, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్‌ వాటర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేస్తే.. దుర్వాసన రాకుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."