Healthhealth tips in telugu

Curd With Flax Seeds:పెరుగులో ఈ పొడి కలిపి తింటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్దం తగ్గి కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది

curd and flax seeds powder : పెరుగులో ఈ పొడి కలిపి తింటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్దం తగ్గి కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది..పెరుగు,ఆవిసే గింజలలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆవిసే గింజలను వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ ఆవిసే గింజల పొడి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.

వీటిలో ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉండుట వలన గుండె జబ్బులు, రక్తపోటు నియంత్రణ మరియు కొలెస్ట్రాల్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు మరియు రోగనిరోధక వ్యవస్థను సరిగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. పెరుగులో ఎటువంటి ఫైబర్ ఉండదు.

అవిసె గింజలలో మ్యూసిలేజ్ అని పిలువబడే కరిగే ఫైబర్‌తో పాటు కరగని ఫైబర్‌ కూడా ఉంటుంది. అందువలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి ఆకలి తొందరగా వేయకుండా చేయటంతో తినాలనే కోరిక తగ్గి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."