Healthhealth tips in telugu

Summer Buttermilk:వేసవిలో శరీరంలో వేడిని నీరసాన్ని తరిమికొట్టే డ్రింక్..

Summer Buttermilk:వేసవిలో శరీరంలో వేడిని నీరసాన్ని తరిమికొట్టే డ్రింక్.. వేసవికాలం ప్రారంభం అయిపోయింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ఎండలో బయటకు వెళ్లి వచ్చాక నీరసం, నిస్సత్తువ వంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే ఈ మజ్జిగ తాగితే చాలా బాగుంటుంది.

మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, రాక్ సాల్ట్, కొత్తిమీర కలిపి తాగితే వడదెబ్బ తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. మజ్జిగలో ప్రోబయటిక్స్ ఉంటాయి. ఇవి కడుపులో బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా మజ్జిగ కడుపుని చల్లబరుస్తుంది.

పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ మధ్యన ప్రతి రోజు తాగవచ్చు. ఈ విధంగా తాగటం వలన మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. గ్యాస్, అజీర్ణం మరియు ఇతర కడుపుకు సంబంధించిన సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ మజ్జిగను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు.. లేదంటే ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తాగవచ్చు. మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తొలగించడమే కాకుండా శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ మజ్జిగను తప్పనిసరిగా తీసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."