Beauty TipsHealthhealth tips in telugu

Tangedu puvvu:అంతరించిపోతున్న తంగేడు పువ్వు..ఈ పువ్వు విశిష్టత తెలుసా..?

Tangedu puvvu Health Benefits : తెలంగాణలో తంగేడు పువ్వులకు చాలా విశిష్టత ఉంది. ఈ చెట్టు పువ్వు, కొమ్మ, బెరడు, అన్ని కూడా ఉపయోగపడతాయి. తంగేడు పువ్వును ముఖ్యంగా బతుకమ్మగా పేర్చి ఆడపడుచులు తొమ్మిది రోజులపాటు ఆడి పాడి అలరిస్తారు.

మన పరిసరాల్లో మరియు మన ఇంటి చుట్టూ పక్కల ఎన్నో రకాల మొక్కలు కనిపించినా సరే… మనకు వాటి గురించి తెలియక ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తాం. అలాంటి మొక్కలలో ఒకటైన తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

తంగేడు చెట్టులో పువ్వులు,ఆకులు,వేర్లు అన్నీ బాగాలు ఉపయోగపడతాయి. తంగేడు పువ్వులతో కాషాయం చేసుకొని ఉదయం పరగడుపున త్రాగితే డయబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్‌ను నుంచి తప్పించు కోవాలంటే.. 30 ఏళ్లు దాటిన వారు నెలలో ఓసారి లేదా రెండుసార్లు తంగేడు పువ్వుల కషాయాన్ని తప్పకుండా తీసుకోవాలి.

తంగేడు ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. తంగేడు పూలలో సాపోనిన్స్ అనే సహజసిద్దమైన యాంటీమైక్రోబయల్ సమ్మేళనం ఉండుట వలన ఫంగస్ మరియు మైక్రోబయల్ ఇన్ ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది.

టైఫాయిడ్, కలరా మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పువ్వులు దాని హైడ్రేటింగ్ లక్షణాల కారణంగా శీతలకరణిగా ఉపయోగిస్తారు. పూర్వ కాలంలో ఎండలో పనిచేసేటప్పుడు ఈ మొక్కలను తమ తలపై పెట్టుకునేవారు. ఈ మొక్క యొక్క శీతలీకరణ శక్తి చాలా గొప్పది.

తంగేడు పువ్వులను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడకట్టి ఆ నూనెను రోజు జుట్టుకి రాస్తూ ఉంటే జుట్టు రాలె సమస్య తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఎండిన తంగేడు పువ్వు పొడిలో నీటిని కలిపి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి. ఈ పువ్వులకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కూడా ఉంది. ఈ పువ్వులను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."