Beauty TipsHealthhealth tips in telugu

Hair Care Tips: జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి..!

Hair Care Tips:ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అనేక అనారోగ్య సమస్యలతో పాటు, జుట్టు రాలే సమస్యలతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బయట దుమ్మూ, ధూళి, కాలుష్యం, ఒంట్లో ఇతర అనారోగ్య సమస్యలు, ఇంట్లో, ఆఫీస్‌లో పని ఒత్తిడి ఇలా జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి.

ఇందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, హెన్నాలు, వివిధ రకాల షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి కొంతకాలమే పనిచేస్తాయి. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో నాచురల్ పదార్దాలతో తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు ఊడిపోకుండా ఉంచడంతో పాటు.. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,బలంగా పెరగటం ఖాయం.. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అనేవి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కనిపిస్తున్నాయి. ఈ సమస్య రాగానే అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఒక నూనె తయారు చేసుకుని వాడితే జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది. .

దీనికోసం బెంగళూరు మిర్చి అని పిలిచే capsicum ఉపయోగిస్తున్నాం. capsicum లో ఉన్న గుణాలు జుట్టు పెరుగుదలకు, జుట్టు బలంగా పెరగడానికి సహాయ పడుతుంది. ఒక క్యాప్సికమ్ తీసుకుని లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అర కప్పు ఆలివ్ ఆయిల్. లో క్యాప్సికం ముక్కలను వేయాలి.

స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి నీటిని పోసి కాస్త వేడెక్కాక ఆ నీటిలో ఆలివ్ ఆయిల్ వేసి ముక్కలు ఉన్న గిన్నె పెట్టి నూనె బాగా వేడెక్కే వరకు ఉంచాలి. ఆ తర్వాత ఆ నూనెను చల్లార్చాలి. ఈ నూనెను ఒక glas జార్ లో వేసుకుని మూత పెట్టి వెలుగు, వేడి తగలని ప్రదేశంలో ఒక వారం రోజుల పాటు అలాగే వదిలేయాలి.

ఇలా చేయడం వల్ల capsicum లో ఉండే ఆయుర్వేద లక్షణాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఒక వారం తర్వాత ఈ నూనెను వడగట్టి జుట్టుకు బాగా పట్టించి మసాజ్ చేయాలి.. అరగంట అయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య లేకుండా జుట్టు బలంగా ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ