Kitchenvantalu

Kitchen Tips:గోధుమలు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే..

Kitchen Tips:గోధుమలు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే..ఒకసారి ధర తక్కువగా ఉందని గోధుమలను ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో చాలామంది గోధుమ పిండిని కొనకుండా గోధుమలను కొని పిండిగా ఆడిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు రేటు తక్కువ ఉందని గోధుమలను ఎక్కువగా కొనేస్తూ ఉంటారు. వాటిని సరైన పద్ధతిలో నిలువ చేయకపోతే పురుగులు పట్టేస్తాయి.

కొంతమంది గోధుమలను నిల్వ చేయటానికి రసాయనక ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

గోధుమలను నిల్వ చేయడానికి తులసి ఆకులు చాలా బాగా సహాయపడతాయి. తులసిలో ఉన్న సహజసిద్ధమైన గుణాలు పురుగులను, కీటకాలను దూరంగా ఉంచి గోధుమల నాణ్యతను కాపాడుతాయి.

తులసి ఆకులలో సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటం వలన పురుగులు, కీటకాలు లేకుండా చేస్తుంది. గోధుమలను తులసి ఆకులను ఉపయోగించి సంవత్సరం అంతా నిల్వ చేయొచ్చు. తులసి ఆకులలో ఉన్న వాసన కూడా కీటకాలను, పురుగులను దూరం చేస్తుంది.

అయితే తులసి ఆకులను ఉపయోగించి గోధుమలను ఎలా నిలువ చేయాలో చూద్దాం. తాజా తులసి ఆకులను తీసుకుని బాగా కడిగి ఆకులు ఎండే దాకా ఆరబెట్టాలి. ఒక డబ్బాలో గోధుమలను పోసి ఎండిన తులసి ఆకులను వెయ్యాలి. ఒక పొర తులసి ఆకులు ఒక పొర గోధుమలు వేయాలి, ఈ విధంగా వేయటం వలన ప్రతి గింజ సురక్షితంగా ఉంటుంది. తులసి ఆకులు బాగా ఎండిపోయి పొడిగా రాలిపోతూ ఉంటే ఆకులను మార్చవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ