Kitchenvantalu

Aamchur Powder:చింతపండుతో పని లేదు ఇలా ఒక్కసారి చేసుకుంటే సంవత్సరంపాటు నిల్వ ఉంటుంది

Aamchur Powder:చింతపండుతో పనిలేదు ఇలాఒక్కసారి చేసుకుంటే సంవత్సరంపాటు నిల్వ ఉంటుంది.. ఈ సీజన్ లో మామిడికాయలు చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. పచ్చి మామిడి కాయతో ఇలా చేసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది.ఆమ్‌చూర్ పొడి (మామిడి పొడి) తయారు చేయడం చాలా సులభం.

కావలసిన పదార్థాలు:
– పచ్చి మామిడి (కాయలు) – 4-5 (పుల్లని రకం)
– ఉప్పు – చిటికెడు (రుచికి సరిపడా)

తయారీ విధానం:
పచ్చి మామిడిని శుభ్రంగా నీటితో కడగండి. దీనివల్ల మామిడిపై ఉన్న ధూళి, మురికి తొలగిపోతాయి. మామిడికాయను శుభ్రం తుడిచి మామిడి తొక్కను పీలర్ లేదా కత్తితో జాగ్రత్తగా తొలగించండి.మామిడిని చిన్న ముక్కలుగా కట్ చేయండి.మామిడి జీడి తీసివేయండి.

మామిడి ముక్కలను ఒక ప్లేట్ లేదా గుడ్డపై సమంగా పరచాలి.వీటిని బాగా ఎండ ఉన్న ప్రదేశంలో 3-4 రోజులు ఎండబెట్టండి. ముక్కలు పూర్తిగా పొడిగా, గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టాలి.ప్రతి రోజు ముక్కలను తిప్పడం వల్ల సమానంగా మరియు తొందరగా ఎండుతాయి.

ఎండిన మామిడి ముక్కలను మిక్సీ లేదా గ్రైండర్‌లో వేసి మెత్తని పొడిగా చేయండి. రుచికి సరిపడా చిటికెడు ఉప్పు కలపవచ్చు. లేదంటే ఉప్పు వేయనవసరం లేదు.
ఆమ్‌చూర్ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరచండి.చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేస్తే చాలా నెలలు నిల్వ ఉంటుంది.

ఆమ్‌చూర్ పొడిని కూరలు, చాట్, సాంబార్, చట్నీలు, లేదా ఇతర వంటకాల్లో పుల్లని రుచి కోసం ఉపయోగించవచ్చు. చింతపండుకి బదులుగా ఈ పొడిని వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ