Amla For Hair:జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారా? ఉసిరితో అన్నీ క్లియర్!
Amla For Hair:జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారా? ఉసిరితో అన్నీ క్లియర్.. మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది జుట్టుకి సంబంధించి ఏ సమస్య వచ్చినా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే పదార్థాలతో చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.
ముఖ్యంగా జుట్టు రాలే సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య రాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉసిరిని ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఉసిరిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఈ వంటివి జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అందించి జుట్టు మూలాలను బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.
ఉసిరి చుండ్రు, దురద, తెల్ల జుట్టు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. జుట్టు కాంతివంతంగా మెరవడానికి కూడా సహాయపడుతుంది. ఒక పాత్రలో జుట్టుకు సరిపడా ఉసిరి పొడి లేదా ఉసిరి రసం వేసి గ్యాస్ మీద ఉంచి దానిలో రెండు స్పూన్ల కొబ్బరినూనె వేసి బాగా వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత ఈ నూనెను వడగట్టి పక్కన పెట్టుకోవాలి.
ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి ఒక గంట అయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళకు అవసరమైన పోషణ అందుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ