Kobbari Burelu:కొబ్బరిబూరెలు పొంగుతూ రావాలంటే ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించండి-
Kobbari Burelu:కొబ్బరిబూరెలు పొంగుతూ రావాలంటే ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించండి.. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నవారికి ఇప్పుడు చెప్పే కొబ్బరి బూరెలు బాగా నచ్చుతాయి. ఎలా తయారుచేసుకోవాలి.. కావలసిన పదార్ధాలు ఏమిటో చూద్దాం.
కావలసిన పదార్థాలు
– మినపప్పు – 1 కప్పు
– బియ్యం పిండి – 2 కప్పులు
– ఉప్పు – తగినంత
– బెల్లం తురుము – 1 కప్పు
– పచ్చి కొబ్బరి తురుము – 3 కప్పులు
– జీడిపప్పు పలుకులు – పిడికెడు
– యాలకుల పొడి – అర టీస్పూన్
– నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:మిక్సీ జార్ లో మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి, జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోండి.ఈ పిండిలో బియ్యం పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిని కలిపి, మూతపెట్టి 1 గంట పాటు నాననివ్వండి.
ఒక కళాయిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి 15 నిమిషాలు మీడియం మంటపై కలుపుతూ వేడి చేయండి. ఆ తర్వాత దీనిలో జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపండి. మరో 5 నిమిషాలు కలుపుతూ వేడి చేసి, స్టవ్ ఆఫ్ చేయండి.
ఈ మిశ్రమంలో 2 టీస్పూన్ల బియ్యం పిండి వేసి కలిపి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత, మిశ్రమాన్ని కావలసిన సైజులో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత .నానిన పిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా కలపాలి.
కళాయిలో నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక, కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేయండి. 4-5 ఉండలను మీడియం మంటపై అటూ ఇటూ తిప్పుతూ, ఎర్రగా క్రిస్పీగా వేయించండి.వేగిన బూరెలను ప్లేట్లోకి తీసుకోండి. అంతే రుచికరమైన కొబ్బరి బూరెలు సిద్ధం.. ఒక్క సారి చేసుకుంటే మరల మరల తినాలని అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

