Kitchenvantalu

Kobbari Burelu:కొబ్బరిబూరెలు పొంగుతూ రావాలంటే ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించండి-

Kobbari Burelu:కొబ్బరిబూరెలు పొంగుతూ రావాలంటే ఈ కొలతలతో ఈ టిప్స్ పాటించండి.. స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నవారికి ఇప్పుడు చెప్పే కొబ్బరి బూరెలు బాగా నచ్చుతాయి. ఎలా తయారుచేసుకోవాలి.. కావలసిన పదార్ధాలు ఏమిటో చూద్దాం.

కావలసిన పదార్థాలు
– మినపప్పు – 1 కప్పు
– బియ్యం పిండి – 2 కప్పులు
– ఉప్పు – తగినంత
– బెల్లం తురుము – 1 కప్పు
– పచ్చి కొబ్బరి తురుము – 3 కప్పులు
– జీడిపప్పు పలుకులు – పిడికెడు
– యాలకుల పొడి – అర టీస్పూన్
– నూనె – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:మిక్సీ జార్ లో మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి, జల్లించి ఒక గిన్నెలోకి తీసుకోండి.ఈ పిండిలో బియ్యం పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిని కలిపి, మూతపెట్టి 1 గంట పాటు నాననివ్వండి.

ఒక కళాయిలో బెల్లం, కొబ్బరి తురుము వేసి 15 నిమిషాలు మీడియం మంటపై కలుపుతూ వేడి చేయండి. ఆ తర్వాత దీనిలో జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసి బాగా కలపండి. మరో 5 నిమిషాలు కలుపుతూ వేడి చేసి, స్టవ్ ఆఫ్ చేయండి.

ఈ మిశ్రమంలో 2 టీస్పూన్ల బియ్యం పిండి వేసి కలిపి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత, మిశ్రమాన్ని కావలసిన సైజులో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత .నానిన పిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా కలపాలి.

కళాయిలో నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక, కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేయండి. 4-5 ఉండలను మీడియం మంటపై అటూ ఇటూ తిప్పుతూ, ఎర్రగా క్రిస్పీగా వేయించండి.వేగిన బూరెలను ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే రుచికరమైన కొబ్బరి బూరెలు సిద్ధం.. ఒక్క సారి చేసుకుంటే మరల మరల తినాలని అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."