Green Egg Masala:గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ ఇలా చేసుకోండి.. చాలా రుచిగా వస్తుంది
Green Egg Masala:గ్రీన్ ఎగ్ మసాలా కర్రీ ఇలా చేసుకోండి.. చాలా రుచిగా వస్తుంది.. egg ఆరోగ్యానికి మంచిది.. కానీ కొంత అమంది egg తినటానికి ఇష్టపడరు. అలాంటి వారికీ కూడా ఇప్పుడు చెప్పే Green Egg masala చాలా అద్భుతంగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు:
– ఉడికించిన గుడ్లు – 4
– అల్లం – కొద్దిగా
– వెల్లుల్లి – కొద్దిగా
– జీడిపప్పు – 10
– పచ్చిమిర్చి – 4
– పెరుగు – 5 టేబుల్ స్పూన్లు
– పుదీనా – కొద్దిగా
– కొత్తిమీర – కొద్దిగా
– నూనె – తగినంత
– జీలకర్ర – అర టీస్పూన్
– కరివేపాకు – కొన్ని
– ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
– ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
– పసుపు – చిటికెడు
– గరం మసాలా – అర టీస్పూన్
– నల్ల మిరియాల పొడి – అర టీస్పూన్
– ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం
మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి.ఆ తర్వాత
స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసి వేడి చేయండి.
నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి gold కలర్ వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్‌ను బాణలిలో వేసి, 10 నిమిషాలు ఉడికించండి. కాస్త వేగిన తర్వాత ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపండి.
ఉడికించిన గుడ్లకు గాట్లు పెట్టి, బాణలిలో వేసి, సన్నని మంటపై 10-15 నిమిషాలు ఉడికించండి.గ్రేవీ గట్టిపడి, నూనె పైకి తేలిన తర్వాత, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన గ్రీన్ ఎగ్ మసాలా సిద్ధం.. ఒక్కసారి తింటే మరల చేసుకుంటారు…
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

