Sorakaya Vada Recipe:కరకరలాడే వేడివేడి సొరకాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా?
Sorakaya Vada Recipe:కరకరలాడే వేడివేడి సొరకాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా.. సాయంత్రం వేళ మీ పిల్లలు లేదా పెద్దల కోసం రుచికరమైన స్నాక్ తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకండి!
ఇంట్లో సొరకాయ ఉంటే చాలు, దాంతో రుచిగా, వెరైటీగా ఉండే సొరకాయ వడలు తయారు చేయవచ్చు. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ వడలు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం ఇక్కడ ఉంది.
కావలసిన పదార్థాలు:
– సొరకాయ తురుము – 2 కప్పులు
– బియ్యం పిండి – 1 కప్పు
– శనగపిండి – 1/2 కప్పు
– జీలకర్ర – 1/2 టీస్పూన్
– ఉల్లిపాయ తరుగు – 1/2 కప్పు
– అల్లం తరుగు – 1 టీస్పూన్
– ఉప్పు – రుచికి సరిపడా
– పచ్చిమిరపకాయల తరుగు – రుచికి తగినంత
తయారీ విధానం:
ఒక గిన్నెలో బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిరపకాయల తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో 2 కప్పుల సొరకాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీటిని జల్లుతూ పిండిని కలపాలి.
నీరు ఎక్కువగా పట్టవు. ఎందుకంటే సొరకాయలోమ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని నీటిని కలపాలి. నీరు ఎక్కువ అయితే వడ సారిగా రాదు. వడలు వేయడానికి సరిపడే విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి చాలా గట్టిగా లేదా చాలా లూజుగా ఉండకూడదు.
ఒక బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, పిండిని చిన్న చిన్న వడలుగా తీసుకుని బాణలిలో వేయాలి.వడలను మీడియం మంటపై గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. అంతే! రుచికరమైన సొరకాయ వడలు సిద్ధం. వీటిని కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ లేదా టమాటో కెచప్‌తో సర్వ్ చేస్తే రుచి అదిరిపోతుంది.
.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

