Kitchenvantalu

Banana Barfi:అరటి పండు తో ఈ కొత్త రెసిపీ ని ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీ గా ఉంటుంది

Banana Barfi :పిల్లలకు స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. ప్రతిసారీ బయట అమ్మే స్వీట్లు పెట్టే కన్నా ఇంట్లోనే స్వీట్లు తయారుచేసి పెట్టటం మంచిది. ఈ రోజు బనానా బర్ఫీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. దీన్ని తీయటి అరటి పండ్లతో చేస్తారు. ఈ బర్ఫీ రెసిపీ చాలా సులువు. పైగా రుచిగా ఉంటుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు
– అరటి పండ్లు – 3 (ముక్కలుగా కట్ చేసి మిక్సీలో గుజ్జుగా చేయాలి)
– కొబ్బరి తురుము – 1½ కప్పు
– నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
– మిల్క్ పౌడర్ – 1 కప్పు
– బెల్లం తురుము – ¾ కప్పు
– ఏలకుల పొడి – ½ టీస్పూన్
– చిక్కటి పాలు – ¼ కప్పు (మరిగించినవి)
– బాదం – గార్నిష్ కోసం

తయారీ విధానం:
ఒక గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం తురుము, పాలు వేసి, స్టవ్ మీద సిమ్ ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం కొంచెం గట్టిపడే సమయంలో నెయ్యి, అరటి గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమం పూర్తిగా గట్టిపడిన తర్వాత, ఒక పాత్రలోకి తీసి, జీడిపప్పు, బాదం ముక్కలతో అలంకరించి, 3-4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లారిన తర్వాత కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. ఈ బనానా బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఒక సారి ట్రై చేయండి.

స్వీట్ తినాలని అనిపించినప్పుడు చక్కగా అరటిపండుతో ఇలా చేసుకుంటే సరి. స్వీట్ తినాలనే కోరిక తీరుతుంది. దానితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."