Sweet Corn Pakoda: స్వీట్ కార్న్ పకోడీలు ఇలా వేశారంటే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
Sweet Corn Pakoda: స్వీట్ కార్న్ పకోడీలు ఇలా వేశారంటే.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. ఒకప్పుడు స్వీట్ కార్న్ చాలా అరుదుగా లభించేది. కానీ ఇప్పుడు చాలా విరివిగానే లభ్యం అవుతుంది.కాబట్టి మధ్యాహ్నం స్నాక్ గా చేసుకుంటే సరిపోతుంది.
కావలసిన పదార్థాలు
– స్వీట్ కార్న్ – 1 కప్పు (ఉడికించి మెత్తగా రుబ్బినది)
– ఉల్లిపాయ – 1 (పెద్దది, సన్నగా తరిగినది)
– శనగపిండి – ½ కప్పు
– పచ్చిమిర్చి – 2 లేదా 3 (సన్నగా తరిగినవి)
– బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
– పసుపు – చిటికెడు
– అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
– చాట్ మసాలా – చిటికెడు
– కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)
– కరివేపాకు – కొద్దిగా (తరిగినవి)
– జీలకర్ర పొడి – చిటికెడు
– నూనె – వేయించడానికి సరిపడా
– ఉప్పు – రుచికి తగినంత
తయారీ విధానం
స్వీట్ కార్న్ పకోడా తయారీ కోసం, ఒక గిన్నెలో మెత్తగా రుబ్బిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. దానిలో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
గ్యాస్ మీద పాన్‌లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, పిండిని చిన్న చిన్న భాగాలుగా చేతితో తీసుకుని వేడి నూనెలో వేసి, gold కలర్ వచ్చే వరకు వేయించాలి. రుచికరమైన స్వీట్ కార్న్ పకోడా సిద్ధం.. దీనికి టొమాటో కెచప్ మంచి కాంబినేషన్. సాయంత్రం స్నాక్స్‌గా పిల్లలకు పెడితే వారు ఇష్టంగా తింటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

