Moong Dal Soup:వేసవిలో ఆరోగ్యాన్ని పెంచే రుచికరమైన పెసరపప్పు సూప్..
Moong Dal Soup:వేసవిలో ఆరోగ్యాన్ని పెంచే రుచికరమైన పెసరపప్పు సూప్.. వేసవిలో శరీరంలో వేడిని తగ్గించి అలసట,నీరసంలను తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది. బయట హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లే బదులు ఇంట్లో కూడా మనం ఆరోగ్యంగా సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఈజీగా చేసుకునే సూప్స్‌లో పెసర పప్పు సూప్ ఒకటి. చాలా తక్కువ టైమ్‌లో రుచిగా ఈ సూప్ చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
– పెసరపప్పు – ¼ కప్పు
– నీరు – 2 కప్పులు
– నెయ్యి – 1 టేబుల్ స్పూన్
– జీలకర్ర – ½ టీస్పూన్
– తురిమిన అల్లం – ½ టీస్పూన్
– క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు – ½ కప్పు
– మిరియాలు – ¼ టీస్పూన్
– అల్లం పొడి – చిటికెడు
– వాము – చిటికెడు
– ఉప్పు – రుచికి సరిపడా
– మెంతి కూర – కొద్దిగా (గార్నిష్ కోసం)
తయారీ విధానం:
పెసరపప్పును 30 నిమిషాలు నీటిలో నానబెట్టి, నీటిని వడకట్టి పక్కన పెట్టండి. కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి చేసి జీలకర్ర, తురిమిన అల్లం వేసి వేగించండి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పును వేసి కొద్దిగా వేయించుకోండి.
ఆ తర్వాత క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలపండి. కొద్దిగా వేగిన తర్వాత 2 కప్పుల నీరు పోసి, కుక్కర్ మూత పెట్టండి. చిన్న మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మెత్తగా కావాలంటే ఒక అదనపు విజిల్ వరకు ఉడికించవచ్చు.
ఉడికిన తర్వాత మిరియాలు, వాము, ఉప్పు, అల్లం పొడి వేసి బాగా కలపండి. చివరగా మెంతి కూరతో గార్నిష్ చేయండి. ఈ రుచికరమైన పెసరపప్పు సూప్ దగ్గు, జ్వరం, జలుబు ఉన్నప్పుడు తీసుకుంటే ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
అలాగే ఈ వేసవి కాలంలో చిన్న పిల్ల నుంచి పెద్దవారి వరకు ఈ సూప్ తీసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ వేసవిలో కనీసం రెండు సార్లు అయినా ఈ సూప్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

