Kitchenvantalu

Bellam kobbari barfi :కేవలం 15 నిమిషాల్లో కొబ్బరి బెల్లంతో బర్ఫీ ఇలా ఈజీగా చేస్కోండి చాలా రుచిగా ఉంటుంది

Bellam kobbari barfi :కేవలం 15 నిమిషాల్లో కొబ్బరి బెల్లంతో బర్ఫీ ఇలా ఈజీగా చేస్కోండి చాలా రుచిగా ఉంటుంది.. కొబ్బరి,బెల్లంలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఈ వేసవిలో ఈ రెండింటిని ఉపయోగించి స్వీట్ చేసుకొని తింటే వేసవిలో వచ్చే నీరసం ఉండదు.

కావాల్సిన పదార్థాలు:
– పచ్చికొబ్బరి ముక్కలు – 1 కప్పు
– కాచి చల్లార్చిన పాలు – ¾ కప్పు
– బెల్లం తురుము – ¾ కప్పు
– యాలకులు – 3
– నెయ్యి – ¼ కప్పు
– శనగపిండి – 1 కప్పు

తయారీ విధానం:
జార్‌లో పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో పాలు, బెల్లం తురుము, యాలకులు వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయండి.ఒక పాన్ లో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక శనగపిండి వేసి, కలుపుతూ 5 నిమిషాలు వేయించండి.

1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, మరో 5 నిమిషాలు కలుపుతూ వేయించండి.గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి, పాన్ కి అంటకుండా విడిపోయే వరకు కలుపుతూ ఉడికించండి.మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, 5 నిమిషాలు ఉడికించండి.

చివరగా మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేయండి. మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసి, రుచికరమైన కొబ్బరి బర్ఫీని సిద్ధం చేయండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది.

దీనిలో మనం ఉపయోగించిన అన్ని పదార్ధాలలో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఈ వేసవిలో ఈ స్వీట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."