Beauty Tips

మెడ నల్లగా మారిందా.. ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది – HOME REMEDIES FOR DARK NECK

HOME REMEDIES FOR DARK NECK:మెడ చుట్టూ నల్లగా మారిందా.. అయితే ఇపుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది…ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల అవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఓట్స్‌లో పెరుగు కలిపి మెడ చుట్టూ స్క్రబ్‌గా ఉపయోగిస్తే మెడ భాగంలోని నలుపు తగ్గుతుంది.

బేకింగ్ సోడాతో ప్యాక్ తయారు చేసి రాసుకుంటే మెడపై నల్లగా ఉన్న చర్మం కాంతివంతంగా మారుతుంది. బేకింగ్ సోడా చర్మంపై మురికిని తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది, వృద్ధ కణాలను తొలగించి చర్మానికి యవ్వనపు కాంతిని అందిస్తుంది, అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

బంగాళదుంప కూడా ఈ సమస్యకు ఒక సమర్థవంతమైన పరిష్కారం. బంగాళదుంప రసాన్ని మెడకు పట్టించి కొంతసేపు అలాగే ఉంచి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే, క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల నలుపు త్వరగా తగ్గుతుంది.

కలబంద చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కలబంద గుజ్జును మెడకు రాసి, 10-15 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, చల్లని నీటితో కడిగేస్తే, రెగ్యులర్‌గా ఇలా చేస్తే మెడ నలుపు తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."