Kitchenvantalu

Pepper Mushroom:నోరూరించే పెప్పర్ మష్రూమ్ రెసిపీ ఇలా చేసుకొని.. తింటే ఆహా అనాల్సిందే

Pepper Mushroom:మష్రూమ్​ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు మష్రూమ్​ ని ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది. ఈ రోజు పెప్పర్ మష్రూమ్​ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
– మష్రూమ్‌లు – 2 కప్పులు
– నూనె – 1 టేబుల్ స్పూన్
– వెన్న – 1 టేబుల్ స్పూన్
– ఉల్లిపాయలు – 2
– క్యాప్సికమ్ – 1
– వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు
– మిరియాల పొడి – 1/2 టీస్పూన్
– వెనిగర్ – 1 టీస్పూన్
– సోయాసాస్ – 1 టీస్పూన్
– కశ్మీరీ కారం – 1/4 టీస్పూన్
– కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం:
1. ఒక పాన్‌లో నూనె, వెన్న వేసి వేడి చేయాలి.
2. వేడైన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేగించాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత మష్రూమ్‌లు వేసి బాగా వేగించాలి.
4. ఆపై వెల్లుల్లి తరుగు, పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి.
5. కొద్దిసేపు వేగిన తర్వాత ఉప్పు వేసి కలియగలపాలి.
6. చివరగా మిరియాల పొడి, వెనిగర్, సోయాసాస్, కశ్మీరీ కారం, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
7. ఈ మష్రూమ్ ఫ్రైని వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.