Healthhealth tips in telugu

Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే.. ఎన్ని రోజులకు మార్చాలి..

Tooth Brush: డేంజర్.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడితే.. ఎన్ని రోజులకు మార్చాలి.. ఉదయం లేవగానే మనం సాధారణంగా బ్రష్ చేసి, టిఫిన్ తింటాం. దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌బ్రష్ ఉపయోగిస్తాం. అయితే, కొందరు నెలల తరబడి ఒకే టూత్‌బ్రష్‌ను మార్చకుండా వాడుతుంటారు.

ఇది ఆరోగ్యకరమైన పద్ధతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకే టూత్‌బ్రష్‌ను ఎక్కువ కాలం వాడటం వల్ల నోటిలో ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఒకే టూత్‌బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దంతాలు మరియు నోటిలో పలు సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యవంతమైన దంతాల కోసం ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి టూత్‌బ్రష్‌ను మార్చాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. బ్రష్ విరిగిపోయే వరకు లేదా బ్రిస్టల్స్ దెబ్బతినే వరకు వేచి ఉండకూడదు. కుటుంబ చరిత్రలో దంత సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి 1-2 నెలలకు టూత్‌బ్రష్‌ను మార్చుకోవాలి.

టూత్‌బ్రష్ బ్రిస్టల్స్ దంతాలను శుభ్రం చేయడానికి, సూక్ష్మక్రిములను తొలగించడానికి సహాయపడతాయి. అయితే, ఎక్కువ కాలం వాడినప్పుడు బ్రిస్టల్స్ బలహీనపడతాయి, దీని వల్ల బాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు బ్రష్‌లో చేరవచ్చు.

అందుకే, కొన్ని రోజులకు ఒకసారి టూత్‌బ్రష్‌ను వేడి నీటిలో కొద్దిసేపు నానబెట్టడం మంచిది. ఎక్కువ కాలం ఒకే బ్రష్ వాడటం వల్ల బాక్టీరియా, జెర్మ్స్ బ్రష్‌లో చేరి, దంతాలు మరియు చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ