Kitchenvantalu

SweetCorn Samosa:ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ “స్వీట్ కార్న్ సమోసా” ఇలా సులభంగా చేసేయండి.. భలే రుచిగా ఉంటుంది..

SweetCorn Samosa:ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ “స్వీట్ కార్న్ సమోసా” ఇలా సులభంగా చేసేయండి.. భలే రుచిగా ఉంటుంది.. వాతావరణం కూల్​గా ఉన్నప్పుడు.. సాయంత్రం సమయంలో.. ఏదైనా వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తుంది. అప్పుడు స్వీట్ కార్న్ సమోసా తింటూ టీ తాగితే ఆ మజానే వేరు.

కార్న్ సమోసా తయారీకి కావలసిన పదార్థాలు:

స్వీట్ కార్న్ – 1 కప్పు
ఉల్లిపాయ తరుగు – 1/4 కప్పు
పచ్చిమిర్చి తరుగు – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
కారం – 1/4 టీ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూన్
ఆమ్ చూర్ పౌడర్ (మార్కెట్లో లభ్యం) – 1/4 టీ స్పూన్
మైదా లేదా గోధుమ పిండి – 1 కప్పు
నూనె – సరిపడా

తయారీ విధానం:
ఒక గిన్నెలో మైదా లేదా గోధుమ పిండి తీసుకుని, కొద్దిగా ఉప్పు, సరిపడా నీరు జోడించి మెత్తగా కలిపి పక్కన ఉంచాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
వేడైన నూనెలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలపాలి.
ఉడికించిన స్వీట్ కార్న్‌ను జోడించి, అందులో ఉప్పు, పసుపు, కారం, ఆమ్ చూర్ పౌడర్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి 5 నిమిషాలు వేగించాలి.
ముందుగా కలిపిన మైదా లేదా గోధుమ పిండితో చిన్న పూరీల ఆకారంలో ఒత్తాలి.
పూరీల మధ్యలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఉంచి, సమోసా ఆకారంలో మడవాలి.
చివరగా, సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేసి వేడిగా సర్వ్ చేయాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."