Kitchenvantalu

Little Millet Dosa : పూర్వికులనాటి బలమైన దృఢమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలతో “సామల క్రిస్పీ దోశ”

Little Millet Dosa : పూర్వికులనాటి బలమైన దృఢమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలతో “క్రిస్పీ దోశ”.. చిరుధాన్యాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని తెలిసిన విషయమే. వీటిలో సామలు ఒకటి. ఇంగ్లిష్‌లో వీటిని లిటిల్ మిల్లెట్స్ అంటారు.

సామలలో ఎన్నో పోషకాలు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సామలను ఎలా తినాలని ఆలోచిస్తున్నవారు వాటిని దోశల రూపంలో తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. సామల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

సామల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:
సామలు – 3 కప్పులు
మినపప్పు – 1 కప్పు
మెంతులు – ¼ టీ స్పూన్
అటుకులు – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
నూనె – ½ కప్పు

సామల దోశ తయారీ విధానం:
సామలు, మినపప్పు, మెంతులను కలిపి 4 నుండి 5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అటుకులను పిండి రుబ్బే ముందు 10 నిమిషాల పాటు నానబెట్టితే సరిపోతుంది. అనంతరం అన్నింటినీ కలిపి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ పిండిలో తగినంత ఉప్పు కలిపి 4-5 గంటలు పక్కన ఉంచాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి, గరిటెతో పిండిని తీసుకుని దోశలా పరచాలి. రెండు వైపులా నూనె వేస్తూ కాల్చాలి. ఇలా సామల దోశ సిద్ధమవుతుంది. దీన్ని పల్లీలు లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.

సామల ఆరోగ్య ప్రయోజనాలు:
సామలు తినడం వల్ల షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇలా సామల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."