Kitchenvantalu

Kitchen Cleaning tips:ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వంటగది మిలమిలా మెరుస్తుంది

Kitchen Cleaning tips:ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వంటగది మిలమిలా మెరుస్తుంది.. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం, పండుగల సమయంలోనే కాదు, ఏ సీజన్‌లోనైనా. ముఖ్యంగా వర్షాకాలంలో వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిచెన్‌ను మరింత జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నా, బ్యాక్టీరియా వ్యాప్తిని నివారించాలన్నా, వంటగదిని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. మీ వంటగదిని శుభ్రంగా, సమర్థవంతంగా ఉంచడానికి ఇక్కడ ఏడు ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి.

1. అనవసర వస్తువులను తొలగించండి
వంటగదిని శుభ్రం చేయడం ప్రారంభించే ముందు, అనవసరమైన వస్తువులను తీసివేయండి. క్యాబినెట్‌లు, అల్మారాల్లోని వస్తువులను పరిశీలించండి. ఆరు నెలలకు పైగా ఉపయోగించని పాత్రలు, వస్తువులను తొలగించండి. అత్యవసరమైనవి తప్ప, మిగిలినవి పడేస్తే స్థలం పెరుగుతుంది, చూడటానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

2. డీప్ క్లీనింగ్
డీప్ క్లీనింగ్‌లో పాడైన వస్తువులు, పిండివంటివి తొలగించండి. చిమ్నీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను శుభ్రం చేయండి, ఎందుకంటే వీటిపై ధూళి, జిడ్డు పేరుకుపోతాయి. వీటిని శుభ్రం చేసే ముందు గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టండి. బేకింగ్ సోడా, డిష్ క్లీనింగ్ సబ్బు కలిపిన మిశ్రమంతో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. షెల్ఫ్‌లు, కౌంటర్ టాప్‌లు
వంట సమయంలో పిండి, నూనె మరకలు కౌంటర్‌పై పేరుకుంటాయి. ధూళి పడితే అవి మురికిగా మారి ఎండిపోతాయి. షెల్ఫ్‌లు కంటి స్థాయి కంటే ఎత్తులో ఉండటం వల్ల జిడ్డు పేరుకుపోతుంది. వెనిగర్, గోరువెచ్చని నీటి మిశ్రమంతో ఈ ప్రాంతాలను శుభ్రం చేయండి. షెల్ఫ్‌ల నుంచి వస్తువులను తీసి, ఈ మిశ్రమంతో క్లీన్ చేయండి.

4. బొద్దింకల నివారణ
వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా కనిపిస్తాయి, ముఖ్యంగా ఆహారం, స్వీట్లపై. కిచెన్ శుభ్రంగా లేకపోతే ఇవి ఎక్కువవుతాయి. పురుగులు, బొద్దింకలను నివారించేందుకు స్ప్రేలు, వికర్షక జెల్స్ ఉపయోగించండి. మింట్ ఆయిల్‌ను నీటిలో కలిపి మూలల్లో చల్లితే బొద్దింకలు రాకుండా ఉంటాయి, కిచెన్ ఫ్రెష్‌గా ఉంటుంది.

5. సింక్ శుభ్రత
సింక్ వంటగదిలో రోజూ ఉపయోగించే ముఖ్యమైన భాగం. దీనిని డిష్ సబ్బు లేదా లిక్విడ్‌తో శుభ్రం చేయండి. డ్రైన్‌ను కూడా శుభ్రపరచండి. బేకింగ్ సోడాను వేడినీటిలో కలిపి డ్రైన్ గొట్టాలలో పోస్తే మురికి, దుమ్ము తొలగిపోతాయి.

6. ఫ్రిజ్ శుభ్రత
ఫ్రిజ్‌లోని మిగిలిపోయిన, అనవసరమైన ఆ94తో శుభ్రం చేయండి. కెమికల్స్ లేకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ఫ్రిజ్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.

7. కిచెన్ మేక్‌ఓవర్
పండుగల సమయంలో లేదా కొత్తదనం కోరుకున్నప్పుడు వంటగదికి చిన్న మేక్‌ఓవర్ ఇవ్వండి. కొన్ని మొక్కలు పెట్టడం లేదా కిచెన్ క్లాత్స్, కర్టెన్స్ మార్చడం వంటివి ఫ్రెష్ లుక్‌ను ఇస్తాయి.

ఈ చిట్కాలను అనుసరిస్తే మీ వంటగది శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పండుగ సీజన్‌లో సమయం ఆదా అవుతుంది, స్థలం కూడా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.