Business

Andhra Pradesh Free Bus For women: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంకు సంబంధించి కీలకమైన అప్ డేట్

Andhra Pradesh Free Bus For women: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంకు సంబంధించి కీలకమైన అప్ డేట్.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం గురించి రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన వివరాలు అందించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణితో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని, ఆగస్టు 15 నుంచి ‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు కొంత ఆలస్యం జరిగిందని వెల్లడించారు. మొత్తం 6,700 బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ పథకం కోసం ఏటా రూ. 1,950 కోట్లు ఖర్చవుతుందని, అయినప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఆగస్టు 6న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించి, ఆగస్టు 15 నుంచి అమలు ప్రారంభమవుతుందని తెలిపారు. మహిళలు ఈ సౌకర్యాన్ని పొందేందుకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాలని సూచించారు.

అయితే, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని, మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్‌లకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

రద్దీ ఎక్కువగా ఉంటే స్కూల్ బస్సులను వినియోగిస్తామని, అయితే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే, తిరిగి వచ్చే సమయాల్లో స్కూల్ బస్సులను ఉపయోగించవద్దని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బస్టాండ్లు, బస్ స్టాప్‌లలో తాగునీరు, సౌకర్యవంతమైన టాయిలెట్లు, ఫ్యాన్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని బస్సులకు మరమత్తులు చేసి సిద్ధం చేశామని వెల్లడించారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."