Aratikaya Bajji:”అరటికాయ బజ్జి” ఈ టిప్స్ తో వేస్తే అచ్ఛం బండి మీద బజ్జి టేస్ట్ వస్తుంది
Aratikaya Bajji:”అరటికాయ బజ్జి” ఈ టిప్స్ తో వేస్తే అచ్ఛం బండి మీద బజ్జి టేస్ట్ వస్తుంది.. కూర అరటికాయలను చాలా మంది సహజంగా ఇష్టపడతారు. వీటితో కూర, పులుసు లేదా వేపుడు చేస్తుంటారు. ఏ విధంగా తయారు చేసినా అరటికాయలు రుచికరంగానే ఉంటాయి.

అయితే, వీటితో బజ్జీలు కూడా తయారు చేసి తినవచ్చు, ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే సులభంగా ఈ బజ్జీలను తయారు చేయవచ్చు. ఇప్పుడు అరటికాయ బజ్జీల తయారీ విధానాన్ని తెలుసుకుందాం.
అరటికాయ బజ్జీల తయారీకి కావలసిన పదార్థాలు:
కూర అరటికాయలు – 2
శనగపిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 కప్పులు
కారం పొడి – 1 టీస్పూన్
ఇంగువ – చిటికెడు
వాము – కొద్దిగా
నూనె – వేయించడానికి తగినంత
ఉప్పు – తగినంత

తయారీ విధానం:
అరటికాయల కొనలను కత్తిరించి, చెక్కు తీసి, పొడవైన ముక్కలుగా కోయాలి.ఈ ముక్కలను నీటిలో వేసి కొంతసేపు నానబెట్టాలి.ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కారం పొడి, పసుపు, వాము, ఇంగువ, తగినంత ఉప్పు వేసి, కొంత నీరు పోసి మోస్తరు జారుగా కలపాలి.

నీటిలో నానబెట్టిన అరటి ముక్కలను తీసి, ఎండు గుడ్డతో పొడిగా తుడవాలి.ఒక పాన్లో నూనె పోసి, బాగా కాగిన తర్వాత, అరటి ముక్కలను ఒక్కొక్కటిగా పిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి వేయించాలి.బంగారు రంగులోకి మారిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
ఈ అరటికాయ బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా పల్లి చట్నీతో కలిపి ఆస్వాదించవచ్చు.

